Priyanka Gandhi: పదే పదే తెలుగులో మాట్లాడిన ప్రియాంక.. ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రసంగం
ABN, First Publish Date - 2023-11-25T14:24:06+05:30
జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ రోడ్ షో విజయవంతంగా జరిగింది. అశేష ప్రజానీకం ప్రియాంకకు ఘనస్వాగతం పలికింది. పాలేరు నియోజకవర్గం పెద్ద తండా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రియాంక తెలుగులో మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ పదే పదే తెలుగులో ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తెలుగులో నినదించారు.
ఖమ్మం: జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ (Congress Leader Priyanka Gandhi) రోడ్ షో విజయవంతంగా జరిగింది. అశేష ప్రజానీకం ప్రియాంకకు ఘనస్వాగతం పలికింది. పాలేరు నియోజకవర్గం పెద్ద తండా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రియాంక తెలుగులో మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ పదే పదే తెలుగులో ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తెలుగులో నినదించారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అశేషజనవాహిని హర్షధ్వానాల నడుమ ప్రియాంకా గాంధీ ప్రసంగం కొనసాగింది. ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలుగులో వివరించారు.
ప్రియాంక స్పీచ్ ఇదే...
‘‘మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. కేసీఆర్ (CM KCR) మీకు ఉద్యోగాలు ఇచ్చాడా. కేసీఆర్ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయి. మీకు ఉద్యోగాలు కావాలా?. బీఆర్‌ఎస్‌ను (BRS) తప్పించండి మీకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. తెలంగాణ రాష్ట్ర రైతులు, ఆడబిడ్డలు, యువత ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. మీ అందరికీ ఒక కల ఉంది ఆ కల నెరవేరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. 10 సంవత్సరాల నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం (BRS Government) తెలంగాణను భ్రష్టు పట్టించింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఉందో అక్కడ ఉద్యోగాలు వచ్చాయి... ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఉద్యోగాలు, ఇళ్ళు, వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే రైతుల రుణాలు మాఫీ అవుతాయి. శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. భారీ మెజారిటీతో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. పొంగులేటి శ్రీనివాస రెడ్డిని (Ponguleti Srinivas Reddy), తుమ్మల నాగేశ్వరరావును (Tummala Nagaeshwar Rao), భట్టి విక్రమార్కను భారీ మెజారిటీతో గెలిపించండి’’ అని ప్రజలను ప్రియాంక కోరారు.
Updated Date - 2023-11-25T16:11:43+05:30 IST