TS POLLS : సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
ABN, First Publish Date - 2023-11-24T17:08:52+05:30
సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ( Harshavardhan Reddy ) కలిశారు. పోస్టల్ బ్యాలెట్లల్లో నిర్లక్ష్యం, ప్రతి ఉద్యోగికి ఇంటి దగ్గర లేదా పంపిణీ కేంద్రం దగ్గర ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ( Harshavardhan Reddy ) కలిశారు. పోస్టల్ బ్యాలెట్లల్లో నిర్లక్ష్యం, ప్రతి ఉద్యోగికి ఇంటి దగ్గర లేదా పంపిణీ కేంద్రం దగ్గర ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అధికారులు కేవలం ఆయా జిల్లాలోని నియోజకవర్గాలల్లో మాత్రమే ఓట్లు కలిగి ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్స్ సరఫరా చేస్తున్నారని హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో ఓటు హక్కును కోల్పోవడం సమంజసం కాదని.. ఇది ఓటు హక్కును హరించడమే అవుతుందని హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-11-24T17:08:57+05:30 IST