Sitaram Yechury: తెలంగాణలో హంగ్ వస్తే సీపీఎం మద్దతు ఎవరికో చెప్పిన సీతారాం ఏచూరి
ABN , First Publish Date - 2023-11-25T13:00:41+05:30 IST
Telangana Elections: దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని సీపీఎం ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదని.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని సీపీఎం ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి (CPM All India General Secretary Sitaram Yechury) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదని, 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ (BJP) కష్టకాలంలో ఉందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో కొంత బలంగా ఉన్నా ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని జోస్యం చెప్పారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బందీ అయ్యాయని ఆరోపించారు. బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని విమర్శించారు. ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై బాధ్యతగా వ్యవహరించడంలేదని, సొరంగానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఆ ఘటనకు ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని మోదీ (PM Modi) ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, అయినా ఈసీఐ (ECI) నోటీసులు ఇవ్వదన్నారు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ (Congress) ఉందన్నారు. యాంటి బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్(CM KCR) ఒంటరిగా పోటీ చేస్తున్నారన్నారు. హంగ్ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఉంటుందని... ఇండియా కూటమిలో ఇప్పటికే ఉన్నామని చెప్పుకొచ్చారు. సీపీఎం ఖమ్మం జిల్లాలో పోటీ చేయకుండా పొత్తులు అనేది అసంభవమని సీతారాం ఏచూరి తేల్చిచెప్పారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి