Doodi Srikanth Reddy: నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను
ABN, First Publish Date - 2023-11-22T15:53:27+05:30
నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ సిద్దిపేట అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డి ( Doodi Srikanth Reddy ) మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కి సవాల్ విసిరారు.
సిద్దిపేట జిల్లా: నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ సిద్దిపేట అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డి ( Doodi Srikanth Reddy ) మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కి సవాల్ విసిరారు. బుధవారం నాడు జిల్లా కేంద్రంలో శ్రీకాంత్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘నేను సవాల్ చేస్తున్న రేపు 10గంటలకు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పసుపు నీళ్లతో స్నానం చేసి వస్తాను. నా సవాల్ కి మీరు మంత్రి హరీశ్‌రావు సిద్ధమా..? నాపై బురద చల్లడం సరికాదు నేను తెల్లకాగితం లాంటివాడిని. నేను ఎవరికీ అమ్ముడు పోలేదు, ఎవరికీ బినామీ కాదు.బీజేపీ కార్యకర్తలను బీఆర్ఎస్ నాయకులు అంగట్లో పశువుల తరహాలో కొనుగోలు చేస్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్కి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది’’ అని దూది శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు.
హరీశ్‌రావు స్థాయిని దిగజర్చుకోవద్దు
‘‘బీజేపీ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ హరీశ్‌రావు స్థాయిని దిగజర్చుకోవద్దు. బీజేపీ వస్తే మోటార్లకు మీటర్లు పెడుతారని హరీశ్‌రావు దుష్పచారం చేస్తున్నాడు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ఇంత వరకు ఆదుకొలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతులకు 3100 మద్దతు ధర ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. రైతుల నోట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టికొడుతోంది. తొమ్మిదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు’’ అని దూది శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-22T16:19:25+05:30 IST