CM KCR: సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
ABN, First Publish Date - 2023-11-25T10:26:49+05:30
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈసీఐ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 30న బాన్సువాడ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు సీఈఓ నుంచి ఈసీఐకు రిపోర్ట్ చేరింది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) ఈసీఐ (Election commission of India) నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 30న బాన్సువాడ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEO) భారత ఎన్నికల సంఘానికి(ECI) రిపోర్ట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ ఈసీఐ అడ్వైజరీ కమిటీకి లేఖ రాశారు. కేసీఆర్‌కు లేఖ పంపాలని అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. దీంతో ఈసీఐ ఆదేశాల మేరకు నిన్న (శుక్రవారం) అర్థరాత్రి కేసీఆర్‌కు సీఈవో వికాస్ రాజ్ (CEO Vikas Raj) లేఖను పంపించారు.
కాగా.. బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై (BRS Candidate Kotha Prabhakar Reddy) కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ సీఈసీకి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ (Congress state president Balmuri Venkat) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-25T10:45:43+05:30 IST