కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etala Rajender: బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు రావు

ABN, First Publish Date - 2023-11-28T15:38:25+05:30

బీఆర్ఎస్ ( BRS )నేతలు బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు రావని హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.

Etala Rajender: బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు రావు

కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ( BRS )నేతలు బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు రావని హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ...‘‘నన్ను గెలిపించుకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తుండు. బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు రావు బిడ్డా. ప్రశాంతంగా ఉన్న హుజూరాబాద్ గడ్డను బ్లాక్ మెయిల్‌కు వాడటం మంచిది కాదు. రాజకీయాలను ఇంతగా దిగజార్చడం చూస్తే బాధగా ఉంది. కేసీఆర్ రెండేళ్లు నన్ను రాసి రంపాన పెట్టాడు. కేసీఆర్‌ను బొంద పెట్టడమే అంతిమ లక్ష్యం’’ అని ఈటల రాజేందర్ చెప్పారు.

కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్

కాగా.. హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. మీరు ఓటేసి దీవిస్తే నాలుగో తేదీన జైత్రయాత్ర లేదంటే మా కుటుంబ సభ్యుల శవయాత్రేనని చెప్పారు. కుటుంబ సభ్యులం ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసే యోచనలో ప్రత్యర్థులు ఉన్నారు.  

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-28T15:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising