ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని చంపాలని చూశారు

ABN, First Publish Date - 2023-10-31T14:52:15+05:30

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ( MP Prabhakar Reddy ) ని చంపాలని చూశారని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు.

హైదరాబాద్: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ( MP Prabhakar Reddy ) ని చంపాలని చూశారని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ...‘‘అయినప్పటికీ దేవుడి దయ వల్ల బతికి బయట పడ్డాడు. ఇలాంటి హత్య రాజకీయాలు సహించము. హిసంత్మక చర్యలు ఎవరు చేసిన సహించేది లేదు. ప్రతీపక్ష శక్తులు ఎన్నో ఉంటాయి. హేయమైన దాడులకు తగిన బుద్ది చెబుతాం’’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

పలువురు నేతల చేరిక

మంగళవారం నాడు పలు పార్టీల్లోని కీలక నేతలు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిలో.. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్‌రెడ్డి తదితర నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయా నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘నాగం జనార్దన్‌రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది. ఎన్నో సార్లు జైలుకు వెళ్లిన నేపథ్యం ఉంది. నాగం జనార్దన్‌రెడ్డిని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాను.. ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. విష్ణువర్ధన్‌రెడ్డి భవిష్యత్తుకు నాది బాధ్యత. విష్ణు నా కుటుంబ సభ్యుడు. దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డి (PJR) నాకు మంచి మిత్రులు. నాగం చేరడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మరింత బలం పెరిగింది.14 స్థానాలు మహబూబ్‌నగర్‌లో గెలవాలి. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, విష్ణువర్ధన్‌రెడ్డి ఇద్దరు కలిసి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపె కోసం పనిచేయాలి. అందర్నీ కలుపుకొని పొండి. తెలంగాణ అభివృద్ది వేగంగా జరుగుతుంది’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Updated Date - 2023-10-31T14:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising