KTR: దరిద్రానికి నేస్తం.. కాంగ్రెస్ హస్తం
ABN, First Publish Date - 2023-11-27T13:49:20+05:30
రైతుబంధు నిలిపివేతపై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చెన్నూరు రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుర్మార్గం వల్లనే రైతుబంధు ఆగిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి లేఖ రాశారని.. రైతుల నోటికాడికొచ్చిన ముద్దను లాక్కున్న దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు ఒకరు 3గంటలు, మరొకరు 5గంటల కరెంటు అంటున్నారన్నారు.
మంచిర్యాల: రైతుబంధు నిలిపివేతపై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చెన్నూరు రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుర్మార్గం వల్లనే రైతుబంధు ఆగిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి లేఖ రాశారని.. రైతుల నోటికాడికొచ్చిన ముద్దను లాక్కున్న దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు ఒకరు 3గంటలు, మరొకరు 5గంటల కరెంటు అంటున్నారన్నారు. కరెంటు కావాలో... కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలన్నారు. కరెంటు వైర్లు పట్టుకుంటే కాంగ్రెస్ వాళ్లకు అర్థం అవుతుందని కేటీఆర్ అన్నారు. దరిద్రానికి నేస్తం కాంగ్రెస్ హస్తమన్నారు. కాంగ్రెస్‌కు ఇప్పటికి 11సార్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదన్నారు. మళ్ళీ ఒక్క ఛాన్స్ అంటూ అడగడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ నేతలు బలిసి కొట్టుకుంటున్నారని.. డిసెంబర్ 3 తర్వాత ఒక్కొక్కరి భరతం పడతామన్నారు.
Updated Date - 2023-11-27T14:02:03+05:30 IST