ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao: తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి.. ఎందుకు ఓటేయాలి?

ABN, First Publish Date - 2023-11-03T16:04:59+05:30

సర్వేలు అన్నీ కేసీఆరే హ్యాట్రిక్ సీఎం అని తేల్చాయని మంత్రి హరీష్‌రావు అన్నారు.

సంగారెడ్డి: సర్వేలు అన్నీ కేసీఆరే (CM KCR) హ్యాట్రిక్ సీఎం అని తేల్చాయని మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) అన్నారు. శుక్రవారం సంగారెడ్డి బీఆర్‌ఎస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి (Jagga Reddy) సాధ్యం కాని హామీలు ఇచ్చారని.. గెలిచాక అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) ఓడినా ప్రజల మధ్యనే ఉన్నారని తెలిపారు. తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇస్తే భోజనం చేయాలని అనిపిస్తలే అన్న పవన్ కళ్యాణ్‌తో (Janasena Chief Pawan Kalyan) బీజేపీ పొత్తు పెట్టుకున్నారన్నారు. తెలంగాణా వ్యతిరేకులతో రేవంత్ రెడ్డి దోస్తీ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఉద్యమంలో పదవులను పట్టుకుని వేలాడారన్నారు. షర్మిలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నారని మంత్రి తెలిపారు.


తెలంగాణ ద్రోహులు షర్మిల, వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajashekar Reddy) అని విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ఖైదీ నెంబర్ 4179 అని అన్నారు. బెయిల్ మీద బయట ఉన్న నేరస్తుడు రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై(Osmania University Students) వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీరు, బిర్యానికి విద్యార్థులు గొడవలు చేస్తారా అని ప్రశ్నించారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌ను గెలిపిస్తే.. పదివేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టసుఖాల్లో అందుబాటులో లేని జగ్గారెడ్డికి ఎందుకు ఓటేయాలి అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌లో అందరూ ముఖ్యమంత్రులే అంటూ ఎద్దేవా చేశారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అవుతా అంటున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లు కుర్చీల కోసమే కొట్లాడుకుంటారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-11-03T16:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising