ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Harish Rao: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 80 సీట్లు గెలవబోతుంది

ABN, First Publish Date - 2023-11-27T23:34:10+05:30

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80 సీట్లు గెలవబోతుందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) పేర్కొన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి రైతుల పట్ల కాంగ్రెస్ వ్యతిరేకత చూపుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

హైదరాబాద్: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80 సీట్లు గెలవబోతుందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) పేర్కొన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ...‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి రైతుల పట్ల కాంగ్రెస్ వ్యతిరేకత చూపుతుంది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. ఉచిత కరెంట్‌ను, ఉత్త కరెంట్‌ను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ పాలనలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పోవడం, అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి రైతులను బలి తీసుకుంది. నకిలీ విత్తనాలు వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2009లో పగటి పూట 9 గంటలు ఇస్తామని చెప్పి రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీలం తుఫాన్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లాకు రూపాయి ఇవ్వలేదు. ఆరోజు మేము అసెంబ్లీలో ధర్నా చేస్తే మమల్ని తొక్కుకుంటు వెళ్లారు’’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు .

రైతుల పట్ల కాంగ్రెస్ కపట ప్రేమ

‘‘ఈరోజు రైతుల పట్ల కాంగ్రెస్ కపట ప్రేమ చూపిస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయం దండుగని మాట్లాడిన చంద్రబాబు నాయుడుకి ఈయన వారసుడు. ఎలుకను తెచ్చి ఎడారిలో ఊతికిన నలుపు నలుపే గాని తెల్లగా కాదు. అక్టోబరు 23వ తేదీ నాడు రైతుబంధు ఆపాలని ఈసీకీ ఫిర్యాదు చేసిన మాట వాస్తవం కాదా! ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మాణిక్యరావు థాక్రే రైతు బంధు ఆపాలని ఫిర్యాదు చేసిన మాట వాస్తవం కాదా. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇద్దరు కలసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రైతు బంధు ఆపాలని మాట్లాడిన మాట వాస్తవం కాదా. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు బంధు ఆపేసిన మాట వాస్తవమా కాదా. తెలంగాణ రాష్ట్రంలో అదే కుట్ర చెయాలని చూస్తున్నారు. ఇప్పటికీ రైతులకు 11 సార్లు రైతు బంధు వేశాము. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసిన వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. డిసెంబర్ 6వ తేదీన రైతుల అకౌంట్స్‌లో రైతు బంధు జమ చేస్తాం’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-11-27T23:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising