Minister Jupalli : హరీష్‌రావు మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడు
ABN, First Publish Date - 2023-12-09T15:29:43+05:30
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం ఏర్పడి రెండే రోజులవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం ఏర్పడి రెండే రోజులవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏబీఎన్‌తో మంత్రి జూపల్లి మాట్లాడుతూ... హరీష్‌రావు మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు.రెండు రోజుల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమనాలి. రెండు రోజుల్లో మూడు పథకాలు ఇంప్లిమెంట్ చేశాం. మొన్నటి వరకు ప్రగతి భవన్‌కి పోవాలంటే అవకాశమే లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయంది. రెండు రోజులకే గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి తేడా కనిపించింది. తెలంగాణ ఉద్యమంలో నేనూ పాల్గొన్నాను. తెలంగాణ వచ్చిన రోజు కంటే ఈరోజు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఫీలవుతున్నారు. అమరవీరుల ఆత్మ ఈరోజు శాంతించింది. ప్రజలు ఏ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అవి నెరవేరుస్తాం’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
Updated Date - 2023-12-09T23:00:07+05:30 IST