ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: రాష్ట్రానికి సీఎం ఉంటాడు.. రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2023-11-28T15:38:23+05:30

Telangana Elections: రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు కానీ.. రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి గంజ్, జేపీఎన్ రోడ్‌లోని ఇస్లాంపురలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.

కామారెడ్డి: రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు కానీ.. రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి గంజ్, జేపీఎన్ రోడ్‌లోని ఇస్లాంపురలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... కేసీఆర్ అమ్మమ్మ ఊరు కామారెడ్డి జిల్లాలో ఉందన్నారు. కేసీఆర్ కామారెడ్డికి లోకల్.. రాష్ట్రమంతటికే లోకల్ అన్నారు. గజ్వేల్‌లో సీడ్స్ కంపెనీలు లైన్ కట్టి మరీ పెట్టబడులు పెడుతున్నారని తెలిపారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని.. కానీ తెలంగాణలో మాత్రమే వారికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలో నిత్యవసర సరుకులు ధరలు పెరిగాయన్నారు. ‘‘మోడీని ప్రియమైన మోడీగా పిలుస్తలేరు పిరమైన మోడీ అంటున్నారు’’ అని సెటైర్ వేశారు. 2014లో జన్‌ధన్ ఖాతాలో రూ.15 లక్షలు ఇస్తా అన్నారు.. ఇచ్చారా అని ప్రశ్నించారు. ‘‘రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200 చేసిండు మోడీ.. మీరు ఓటువేస్తే రూ.3000 అవుతవి. మోడీ అధికారంలో ఉంటే సామాన్యుడు బతుకలేడు’’ అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-28T15:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising