MLC Kavitha: ఎమ్మెల్యే షకీల్‌పై కాంగ్రెస్ దాడిని ఖండించిన కవిత
ABN, First Publish Date - 2023-11-22T15:44:56+05:30
బోధన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) తీవ్రంగా ఖండించారు.
నిజామాబాద్: బోధన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ...‘‘ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. 60 లక్షల గులాబీ సైన్యం ముందు మీరెంత. సత్తా కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులను ప్రజాక్షేత్రంలో దీటుగా ఎదుర్కొంటారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు’’ అని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్‌లో కాంగ్రెస్ నాయకులపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే షకీల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు మాత్రం కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-22T16:19:40+05:30 IST