Nadendla Manohar : 26న కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం
ABN, First Publish Date - 2023-11-18T21:19:11+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తెలిపారు. శనివారం నాడు కూకట్‌పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. మనోహర్ పాల్గొని మాట్లాడుతూ... ‘‘ఈనెల 26వ తేదీన కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. కూకట్‌పల్లిలో బహిరంగ సభలో ప్రసగింస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్ల కోసం గట్టిగా ప్రయత్నించాము. అనుకొని కారణాల వల్ల శేరిలింగంపల్లి వదులుకోవాల్సి వచ్చింది. అందరూ కృషి చేస్తేనే హైదరాబాద్ నగరం, మహా నగరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధికి అందరం తోడ్పడ్డాము. ఆంధ్ర నుంచి వచ్చిన అనేక మంది ఇక్కడికి వచ్చి పని చేసి సంపాదించుకున్నది ఇక్కడే పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకున్నాము. ఐటీ విభాగం ఎంతో కృషి చేసి జనసేన పార్టీని ప్రజలల్లోకి తీసుకొని వెళ్లాలి. జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఎప్పుడు 21 బీ ఫారంలో అభ్యర్థులకు ఇచ్చి వెనక్కి తీసుకోవటం జరిగింది. వైఎస్సార్టీపీ, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నాయి. ఇక్కడి వారి తరపున నిలబడేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
రాజకీయాల్లో పవన్ లాంటి నాయకుడు దేశంలో ఎవరు లేరు
కూకట్‌పల్లిలో విజయం సాధించి, రెండు రాష్ట్రాలకు ఓ సందేశం ఇద్దాం అనుకుంటున్నాము. వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దేశంలో ఎవరు లేరు. ఆంధ్ర నాయకులు తెలంగాణను పాలిస్తున్నారని రాష్ట్రాన్ని విభజించారు. ఇన్ఫోసిస్ విశాఖపట్టణంలో శాటిలైట్ కార్యాలయం ఏర్పాటు చేశారు.దానిని అక్కడి ప్రభుత్వం తామే తీసుకొని వచ్చామని చెప్పుకుంటున్నారు.తెలంగాణలో 3వేల పై చిలుకు స్టార్టఅప్‌లు వస్తుంటే.. ఆంధ్రలో మాత్రం స్టార్టఅప్‌లు కరువయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఐటీ హబ్, స్టార్ట్ అప్ హబ్‌లు ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలి. ఇండో సోల్ అనే కంపెనీకి 8,348 ఎకరాలు కేటాయించారు. వారేమో మొత్తం 5 వేల ఉద్యోగాలు విడతల వారీగా కల్పిస్తున్నారు. జనసేన పార్టీలో ఉన్న క్రియాశీలక సభ్యత్వం, దేశంలో ఉన్న ఏ పార్టీలో లేదు. 2019 ఎన్నికల తర్వాత, జగన్ దాష్టిక పరిపాలన చూసి, అమరావతి రైతుల కోసం ఢిల్లీకి వెళ్లాము. రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాము. కూకట్‌పల్లిలో జనసేన కార్యాలయం ఏర్పాటు చేస్తాము’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-18T21:28:10+05:30 IST