TS Assembly Polls : కేసీఆర్ సర్కార్‌పై నిర్మలా సీతారామన్ ప్రశ్నల వర్షం
ABN, First Publish Date - 2023-11-21T16:08:53+05:30
తెలంగాణని సీఎం కేసీఆర్ ( CM KCR ) అప్పుల పాలు చేశారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళ వ్యక్తం చేశారు. మంగళవారం నాడు జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణని సీఎం కేసీఆర్ ( CM KCR ) అప్పుల పాలు చేశారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆమె ఆందోళ వ్యక్తం చేశారు. మంగళవారం నాడు జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ...‘‘ఎన్నికల ప్రచారంలో నా మొదటి సమావేశం ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎడ్యుకేటెడ్, ప్రొఫెషనల్స్‌తో పాటు అన్ని సెక్షన్స్ ఉంటాయి. తెలంగాణలో ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి. ఈ ఎలక్షన్స్ ప్రాముఖ్యత ప్రజలకు తెలపాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రి చేసి తీరుతాం. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. నీళ్లు, నిధులు, నియామకాల.. తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు. హైదరాబాద్ లాంటి సిటీని.. నైపుణ్యం ఉన్న యువతను ఉపయోగించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర చేసిన అప్పులు రాబోయే తరాలకు భారంగా మారుతోంది. దళిత ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు. డిప్యూటీ సీఎం రాజయ్యను ఆరు నెలలకే తొలగించారు. అక్షరాస్యతలో నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ వెనుకబడింది. కేసీఆర్ ఎన్మికల హామీ 3,116/- నిరుద్యోగ భృతి ఎక్కడ? కేసీఆర్ హయాంలో 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని బూతులు తిట్టే ప్రభుత్వం తెలంగాణకు అవసరమా? జనవరి 22వ తేదీన అయోద్య రామమందిరం ప్రారంభిస్తాం’’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
పెట్రోల్ మీద కేసీఆర్ ప్రభుత్వం వ్యాట్ వేసింది
‘‘2014లో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది. హైదరాబాద్ డెవలప్‌మెంట్ అయి రెవెన్యూ సెంటర్‌గా మారింది. రెవెన్యూ జనరేట్ చేసే ప్రాంతం తెలంగాణలో హైదరాబాద్, ఇన్ప్ర్‌స్ట్రక్చర్ ఉంది. కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూని డెఫిసిట్ చేసిన ఘనత కేసీఆర్‌కి దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం పాలసీ వల్ల మంచి కంపెనీలు హైదరాబాద్‌కి వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయడానికి సత్తా లేకుండా పోయింది. కుటుంబ పాలనా పార్టీ, సరిగ్గా డబ్బు యూస్ చేయలేని పార్టీ మనకు కావాలా..? జూబ్లీహిల్స్‌లో హయ్యర్ పూర్ సెక్షన్ ఉంది. మన ఫ్యూచర్ అప్పుల పాలు అవుతుంది. కోవిడ్ లాంటి టైం లో బారో చేసి ఫైనాన్స్‌ని, ఫ్యూచర్‌కి బర్డెన్ పడకుండా కేంద్ర ప్రభుత్వం నడిపింది. ఒక్క ప్రాజెక్ట్‌ని బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా పూర్తి చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను మరిచారు. దళిత సీఎం ఎటు పోయింది. జూబ్లీహిల్స్‌లో యంగ్ కాండిడేట్ ఉన్నాడు సపోర్ట్ చేయండి. డెవలప్‌మెంట్ చేసే పార్టీ కావాలి. ప్రజలకు పనికొచ్చే పనులను కేసీఆర్ చేయట్లేదు. పెట్రోల్ మీద కేసీఆర్ ప్రభుత్వం వ్యాట్ వేసింది. వ్యాట్‌ని కేంద్ర ప్రభుత్వం వేయలేదు. పార్టీ పేరులో తెలంగాణ తీసేసిన కేసీఆర్.. నేడు తెలంగాణ గురించి అన్ని మాట్లాడుతున్నారు’’ అని నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకం
‘‘ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి లేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు ప్రవేశపెడతాం.కేసీఆర్‌ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవటం లేదు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకం. బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారు.పది లక్షలకు గాను.. 8లక్షల ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేసింది. డిసెంబర్ లోపు మిగిలిన ఉద్యాలను భర్తీ చేస్తాం.మోటార్లను మీటర్లు అనేది శుద్ధ అబద్దంప్రధానమంత్రిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారు’’ అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-21T17:00:33+05:30 IST