ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srinivasa Reddy: నన్ను ఓడించేందుకు కేసీఆర్ మూడు వందల కోట్లు పంపించారు

ABN, First Publish Date - 2023-11-22T21:36:12+05:30

ఇప్పటికే నన్ను ఓడించాలని మూడు వందల కోట్లను సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేకి పంపించాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లా: ఇప్పటికే నన్ను ఓడించాలని మూడు వందల కోట్లను సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేకి పంపించాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు నేలకొండపల్లి మండలం చెన్నారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...‘‘ఇప్పుడు జరిగేది ఎన్నికల కురుక్షేత్రం. ధర్మానికి, అధర్మానికి, ప్రజా పాలనకు, దోపిడీ పాలనకు మధ్య ఈయుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మీ అందరి దీవెనలతో మీ మనసులో ఉన్న ఇందిరమ్మ రాజ్యం కోసం ఆ నరరూప రాక్షసుడు పాలనను అంతమొందిద్దాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఆయన కన్నీరుకు కరిగి పోవద్దు

‘‘ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడంతో పాటు ఆడబిడ్డ పెళ్లికి లక్ష పదహారు వేలతో పాటు తులం బంగారం ఇస్తాం. కావాల్సినన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులైన వారికి రేషన్ కార్డులు అందిస్తాం.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రామంలో మిగిలిన రోడ్లు పూర్తి చేస్తాం. ఇవన్నీ రావాలి, కావాలి అంటే చేతి గుర్తుకు ఓటేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి. ఎమ్మెల్యే కందళ ఉపేందర్‌రెడ్డి కన్నీటి పర్యంతమైనట్లు యాక్టింగ్ చేశాడు. మరో రెండు రోజుల్లో కుటుంబ సభ్యులతో కూడా కన్నీరు పెట్టిస్తాడు. మనం ఆయన కన్నీరుకు కరిగిపోతే మరో ఐదేళ్లు మనల్ని ఏడిపిస్తాడు. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మేజార్టీతో నన్ను గెలిపించాలి’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-22T21:36:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising