Ponnala Lakshmaiah: కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం
ABN, First Publish Date - 2023-11-01T19:14:06+05:30
కాంగ్రెస్ పార్టీ ( Congress Party )లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaiah ) అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ( Congress Party )లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaiah ) అన్నారు. బుధవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘కాంగ్రెస్ పార్టీ మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన 50 శాతం ప్రజల మద్దతు కూడా తెచ్చుకోలేక పోయింది. 50 శాతం సీట్లను కూడా గత ఎన్నికల్లో సాధించుకొలేక పోయింది. కాంగ్రెస్లో వెనకబడిన వర్గాలు గెలవలేక పోతున్నాయి. బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీనే. సర్వేలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయోగాలు బీసీలపై చేస్తోంది. 40 శాతం బీసీలు ఉన్నప్పుడు మొత్తం 50 శాతం సీట్లు కూడా గెలవలేని కాంగ్రెస్ ఇప్పుడు ఎలా అధికారంలోకి వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం కలే. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయం’’ అని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.
Updated Date - 2023-11-01T19:14:06+05:30 IST