PM Modi: మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో ప్రధాని మోదీ ప్రచారం.. బీజేపీ నేతల్లో జోష్
ABN, First Publish Date - 2023-11-27T09:12:35+05:30
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు పెంచింది. ఇప్పటికే బీజేపీ అగ్రినేతలు రాష్ట్రంలో ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు పెంచింది. ఇప్పటికే బీజేపీ అగ్రినేతలు రాష్ట్రంలో ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సహా ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలోని మూడు జిల్లాల్లో ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీజేపీ (BJP) సిద్ధం చేసింది. నేడు మహబూబ్‌నగర్, కరీంనరగ్, హైదరాబాద్‌లలో ప్రధాని ప్రచారం జరుగనుంది.
ఈరోజు (సోమవారం) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోదీ.. ఉదయం 10:25 గంలలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11:30 గంటలకు హకీంపేట్‌కు చేరుకుంటారు. హకీంపేట్ నుంచి మధ్యాహ్నం 12:35గంటలకు మహబూబాబాద్ చేరుకోనున్నారు. 12:45 నుంచి 1:25 వరకు 40 నిమిషాల పాటు సభలో పీఎం పాల్గొంటారు. 1:35గంటలకు మహబూబాబాద్ నుంచి బయలుదేరి 2:30 గంటలకు మోదీ కరీంనగర్ చేరుకోనున్నారు. 2:45 గంటల నుంచి 3:25 గంటల వరకు కరీంనగర్ సభలో పాల్గొననున్నారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం 4:35గంటలకు హైదరాబాద్ విమానాశ్రయనికి చేరుకోనున్న మోదీ.. సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు హైదరాబాద్‌లో రోడ్డు షో చేయనున్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్లు మోదీ రోడ్ షో ఉండనున్నారు. రోడ్ షో తర్వాత గురుపౌర్ణమి సందర్భంగా అమీర్‌పేట్‌లోని గురుద్వారాలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-27T12:59:49+05:30 IST