Raghunandan Rao : కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
ABN, First Publish Date - 2023-10-30T20:18:21+05:30
కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Prabhakar Reddy )పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు.
మహబూబ్‌నగర్: కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Prabhakar Reddy )పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు. సోమవారం నాడు మహబూబ్‌నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ... ‘‘ప్రభాకర్‌రెడ్డిపై దాడితో నాకు ఎటువంటి సంబంధం లేదు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జరిగిన విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలి. బీజేపీ కార్యకర్త దాడికి పాల్పడితే నేనే అతడిని తీసుకొచ్చి అప్పచెబుతా. నేను గెలుస్తున్నానని BRS నేతలు కుట్రపురితంగా వ్యవహరిస్తున్నారు. బట్ట కాల్చి మీద వేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు.
Updated Date - 2023-10-30T20:18:21+05:30 IST