ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: అధిష్ఠానం పిలుపు.. ఢిల్లీకి బయలు దేరిన రేవంత్

ABN, First Publish Date - 2023-12-05T18:21:21+05:30

సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును హై కమాండ్ ఖరారు చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులతో కూడిన క్యాబినేట్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ: సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును హై కమాండ్ ఖరారు చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులతో కూడిన క్యాబినేట్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్ఠానం నుంచి ప్రకటన రావడంతోనే రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) కాసేపటి క్రితమే గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా నుంచి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు.

కాగా.. హోటల్ ఎల్లా వద్ద రేవంత్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. రేవంత్ సీఎం ప్రకటనపై కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పేరు ప్రకటించడంతో గాంధీభవన్ వద్దకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. కార్యకర్తలతో గాంధీభవన్ సందడిగా మారింది.

Updated Date - 2023-12-05T19:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising