ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: 2018లో కుట్రలు చేసి కేసీఆర్ నన్ను ఎమ్మెల్యేగా ఓడించారు

ABN, First Publish Date - 2023-11-17T22:18:36+05:30

2018లో కుట్రలు చేసి కేసీఆర్ తనను ఓడించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.

హైదరాబాద్: 2018లో కుట్రలు చేసి సీఎం కేసీఆర్ ( CM KCR ) తనను ఓడించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. శుక్రవారం నాడు కుత్బుల్లాపూర్ జయ భేరి సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నన్ను...మళ్లీ మీ ఆశీర్వాదంతో పార్లమెంట్‌కు పంపించారు. పార్లమెంట్‌లో నా పనితనం చూసి సోనియా గాంధీ నాకు తెలంగాణకు అధ్యక్ష పదవిని ఇచ్చింది. ఉద్యమాల గడ్డను, తాగుబోతుల అడ్డాగా మార్చిండు ఈ తాగుబోతు కేసీఆర్. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక హైదరాబాద్ పలు ప్రాంతాల్లో చాలీచాలని జీతాలతో పనులు చేస్తూ బతుకు వెళ్ల దీసు కుంటున్నారు. తెలివి ఉన్న వ్వాడేవడైన ఇసుక మీద ప్రాజెక్టులు కడతారా. తెలంగాణ రాష్ట్రంలో ఈ సన్నాసి కట్టిన ప్రాజెక్టులు కూలీ పోయే పరిస్థితి దాపురించింది. అభివృద్ధి చేస్తా అని తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని గెలిచిన కేసీఆర్, తన కుటుంబంను మాత్రమే వృద్ధి చేసుకున్నాడు. తెలంగాణలో మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి. తన బిడ్డకు, కొడుకుకు, అల్లుడికి రాష్ట్రాన్ని దొచిపెట్టి రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించాడు. పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్న మహిళలకు న్యాయం జరగాలన్న రైతుల చావులు ఆగాలన్నా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసి కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-17T22:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising