ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: కేసీఆర్ నోరే కంపు కొడుతుంది

ABN, First Publish Date - 2023-11-22T21:25:33+05:30

సీఎం కేసీఅర్ ( CM KCR ) చరిత్రను ప్రజలు గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) వ్యాఖ్యానించారు.

సిద్దిపేట జిల్లా: సీఎం కేసీఅర్ ( CM KCR ) చరిత్రను ప్రజలు గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ విజయ భేరి సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..‘‘కేసీఆర్‌ను ఓడించాలని గజ్వేల్ ప్రజలు ఆలోచిస్తుంటే కేసీఆర్ కామారెడ్డి వెళ్లాడు. కామారెడ్డిలో అసలోడు ఉన్నాడు. గజ్వేల్ నుంచి కామారెడ్డికే కాదు కన్యాకుమారి కానీ శంకరమాణ్యాలకు పోయిన ప్రజలు నిన్ను ఓడించడం ఖాయం. కేసీఆర్ వచ్చినప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎర్రవల్లిలో ఎలా ఉండు. కాలువలు ఆయన ఫార్మ్‌హౌస్ చుట్టు ఉన్నాయి. ప్రజల భూములు తీసుకొని అతని బంధువు కావేరి భాస్కర్ భూములు కాపాడుకున్నాడు. కేసీఆర్ పండించిన వడ్లను కావేరి వాళ్లు నాలుగు వేల రెండు వందల యాభైకి కొంటున్నారు. గజ్వేల్ రైతుల వడ్లకు ఒక ధర కేసీఆర్ వడ్లకు మరో ధర. కేసీఆర్ నువ్వు ఓడితే ఫార్మ్‌హౌస్‌లో పండటం కాదు, నువ్వు దోచుకున్న లక్ష కోట్లు గుంజడం ఖాయం’’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

కేసీఆర్ నోరే కంపు

‘‘హైదరాబాద్ చుట్టు పది వేల ఏకరాలు కబ్జా చేసిన బకాసురుడు కేసీఆర్. కేసీఆర్ తింటే బకాసురుడు, పంటే కుంబకర్ణుడు. అమ్మ లాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలి. నేను ఇక్కడకు వస్తున్నానని తెలిసి కేసీఆర్ కొడంగల్ పోయిండు. నా నోరు కంపు ఉందని కేసీఆర్ అంటుండు, ఇద్దరం కలిసి దవాఖాన వెళ్దాం ఎవరిదికి కంపో తెలుస్తది. నేను సుక్క ముట్టను, కేసీఆర్ నువ్వు సుక్క లేనిది ఉండవు, నేనెక్కడ నువ్వెక్కడ. గృహలక్ష్మి పథకం కింద వ్యవసాయానికి, నిరుపేదలకు ఉచిత కరెంట్ ఇస్తాం. ఈ నెల కేసీఆర్ ఉంటే రెండు వేలే. వచ్చే నెల కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బొంద పెడితే నాలుగు వేల పెన్షన్ ఇస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-11-22T21:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising