Revanth Reddy: ఎంపీ పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా?
ABN, First Publish Date - 2023-12-06T16:04:40+05:30
తెలంగాణ సీఎం, సీఎల్పీ నేత, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌కి చేరుకున్నారు. స్పీకర్ ఓం బిర్లా ( Speaker Om Birla ) ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు.
ఢిల్లీ : కాబోయే తెలంగాణ సీఎం, సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌కి చేరుకున్నారు. స్పీకర్ ఓం బిర్లాను ( Speaker Om Birla ) కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. రేపు (గురువారం) సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రేవంత్‌రెడ్డి చేయబోతున్నారని సమాచారం. మంగళవారం కాంగ్రెస్ హై కమాండ్ సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డిని ప్రకటించడంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఏఐసీసీ అగ్రనేతలతో తన కేబినెట్ కూర్పుపై చర్చించినట్లు సమాచారం. అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-12-06T16:15:10+05:30 IST