TS NEWS: పశు సంవర్థక శాఖలో ముఖ్యమైన ఫైళ్లని చించేసిన తలసాని మాజీ ఓఎస్డీ
ABN, First Publish Date - 2023-12-08T23:06:50+05:30
మాసబ్ ట్యాంక్‌లో ఉన్న పశు సంవర్థక శాఖలో ముఖ్యమైన ఫైళ్లని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ చించేయిస్తున్నారు. ఫైల్స్ అన్ని చించేసి సంచులల్లో మూట గట్టి బయటకి తీసుకెళ్లేందుకు మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడున్న సిబ్బంది కొంతమంది కళ్యాణ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారిని తోసుకుంటూ వెళ్లినట్లు సమాచారం.
హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్‌లో ఉన్న పశు సంవర్థక శాఖలో ముఖ్యమైన ఫైళ్లని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ చించేయిస్తున్నారు. ఫైల్స్ అన్ని చించేసి సంచులల్లో మూట గట్టి బయటకి తీసుకెళ్లేందుకు మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడున్న సిబ్బంది కొంతమంది కళ్యాణ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారిని తోసుకుంటూ వెళ్లినట్లు సమాచారం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి సంబంధించిన యనిమాల్ హస్బెండ్రీ, ఫిషరీస్, సినిమాటోగ్రఫీ శాఖలకి ఓఎస్డీగా కళ్యాణ్ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొంతమంది మాజీ మంత్రులు, మాజీ అధికారుల్లో భయం మొదలైంది. దీనిలో భాగంగానే పశు సంవర్థక శాఖ కార్యాలయానికి వచ్చిన కళ్యాణ్ ఆయా శాఖలకు చెందిన పాత ఫైళ్లు అన్నింటినీ చించేసి వాటిని అక్కడి నుంచి తరలిస్తున్నాడు.
ఓఎస్డీగా తన పదవి కాలం అయిపోయి నాలుగు రోజులైనా కూడా డిపార్ట్‌మెంట్‌కి వచ్చి ఫైల్స్‌ని కళ్యాణ్ తీసుకెళ్తున్నారు. డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటి ఫైల్స్ బయటకి తీసుకెళ్లొద్దని సీఎస్ శాంతి కుమారి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కూడా కొంతమంది డిపార్ట్‌మెంట్ సిబ్బంది సహకారంతో ఫైల్స్‌ని కళ్యాణ్ చించేస్తున్నారు. బీరువాలో ఉన్న ఫైల్స్‌ని ఎలుకలు కొడుతున్నాయనే సాకుతో వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు కుంటి సాకులు చెబుతున్నాడు. ఇవేమీ ముఖ్యమైన ఫైళ్లు కాదని అక్కడ ఉన్న సిబ్బందిని కళ్యాణ్ దబాయించాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న సిబ్బంది సీఎస్‌కి తెలిపి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-12-08T23:07:04+05:30 IST