Congress Manifesto: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. డేట్‌తో సహా జాబ్ క్యాలెండర్
ABN, First Publish Date - 2023-11-17T13:32:33+05:30
Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. తమ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో (Telangana Congress Manifesto) విడుదలైంది. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge) మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించారు. తమ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితమని ఖర్గే అన్నారు. సర్వమతాలకు కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ పత్రమని, హిందువులకు భగవద్గీత , ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్లకు బైబిల్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంతటి విలువైనదని ఏఐసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. దాదాపు 42 పేజీలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అలాగే జాబ్ క్యాలెండర్‌ను (Job Calender) కూడా హస్తం పార్టీ విడుదల చేసింది. గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీ డేట్‌ను కూడా ప్రకటించింది. ఫిబ్రబర్ 1, 2024లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే..
నిరుద్యోగ నిర్మూలన
ఉద్యోగం కల్పించే వరకు రూ.4 వేల నిరుద్యోగ భృతి
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు
ఎస్సీ రిజర్వేషన్ల పెంపు
ఏబీసీడీ వర్గీకరణ
బెల్ట్ షాపులు రద్దు
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఎంటి స్థలం, గౌరవ భృతి
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.
3 లక్షల వడ్డీ లేని పంట రుణం.
కోతుల నివారణకు ప్రతీ జిల్లాలో స్టెరిలైజ్ కేంద్రం.
కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ.
చెరువుల నిర్వాహణ, మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత.
తొలి క్యాబినెట్లో మెగా డీఏస్సీ
రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్ల బడ్జెట్.
విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్.
విద్యా రంగానికి బడ్జెట్లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు.
ఖమ్మం, ఆదిలాబాద్‌లలో నూతన విశ్వవిద్యాలయాలు.
వైద్య రంగం బడ్జెట్ రెట్టింపు.
ధరణి స్థానంలో భూమాత పోర్టల్.
రేషన్ ద్వారా సన్న బియ్యం , రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ భృతి.
కొత్త రేషన్ కార్డులు.
200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు.
ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీన పక్రియ పూర్తి చేస్తాం.
ప్రతీ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం.
కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం.
మహిళా సంఘాలకు పావులా వడ్డీ రుణాలు.
జూనియర్ న్యాయవాదులకు మొదటి 5 సంవత్సరాలు నెలకు రూ.5 వేల గౌరవ భృతి.
100 కోట్లతో జర్నలిస్ట్‌ల సంక్షేమ నిధి.
హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ళ సమస్యకు పరిష్కారం.
ఎన్నారైల సంక్షేమ బోర్డ్ .
దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్.
దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నెలకు రూ.12 వేలు
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-17T15:01:28+05:30 IST