ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Election: మాజీ IAS గోయల్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. టాస్క్‌ఫోర్స్, ఎలక్షన్స్ స్క్వాడ్ సోదాలు

ABN, First Publish Date - 2023-11-24T20:30:30+05:30

తెలంగాణ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లోని మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ( Goyal ) ఇంట్లో ఎలక్షన్స్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించింది.

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లోని మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ( Goyal ) ఇంట్లో ఎలక్షన్స్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ సోదాలు చేపట్టింది. ఏకే గోయల్ ఇంట్లో భారీగా నగదు డంపు అయి ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ నేతలు సమాచారం అందించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన సమాచారంతో మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. 2010లో పదవీ విరమణ పొందిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏకే గోయల్ సలహాదారుడిగా పనిచేశారు. అయితే ఈ సమాచారం తెలిసి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు అక్కడకు వచ్చారు. దీంతో ఇరుపార్టీల్లోని కార్యకర్తలు, నేతల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో గోయల్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఓ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ విలువైన వస్తువులు తీసుకొని పోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ బైక్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఏకే గోయల్ ఇంట్లో రెండు గంటలుగా సెర్చ్ ఆపరేషన్

జూబ్లీహిల్స్ ఏకే గోయల్ ఇంట్లో రెండు గంటలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ సమక్షంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. రెండు గంటలుగా ఏకే గోయల్‌ను ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రశ్నిస్తోంది.


ఏకే గోయల్ ఇంటికి విజయరెడ్డి

జూబ్లీహిల్స్ ఏకే గోయల్ ఇంటికి ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి విజయరెడ్డి వచ్చారు. ఉదయం సమాచారం ఇస్తే ఇప్పుడు సోదాలు చేయడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మా కార్యకర్తలపై పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఉన్న నగదు మొత్తం తరలించారని విజయరెడ్డి తెలిపారు. ఐడీ కార్డులు లేకుండా అధికారులు రూపంలో లోపలకి వెళ్లారని విజయరెడ్డి చెప్పారు.

Updated Date - 2023-11-24T23:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising