ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha: కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు బిజీ బిజీ.. కవితను అరెస్ట్‌ చేస్తారా?

ABN, First Publish Date - 2023-03-09T18:43:22+05:30

తెలంగాణ (Telangana)లో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఈడీ విచారణ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు బిజీ బిజీగా ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఈడీ విచారణ.. అరెస్ట్‌ ఊహాగానాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల కదలికలపై కేంద్ర ఇంటెలిజెన్స్ (Central Intelligence) వర్గాలు నిఘా పెట్టాయి. బీఆర్‌ఎస్ శ్రేణుల ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పరిణామాలపై కేంద్రానికి నిఘావర్గాలు రిపోర్టు ఇచ్చాయి. కవిత ఈడీ విచారణ రోజే.. హైదరాబాద్‌లో కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) పర్యటించబోతున్నారు. ఈనెల 12న సీఐఎస్‌ఎఫ్ (CISF) పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో అమిత్‌షా పాల్గొననున్నారు. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అవుతారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరవ్వాలంటూ బుధవారం కవితకు ఈడీ నోటీసు (ED Notice) పంపిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె బుధవారమే ఢిల్లీకి వెళ్లారు. విచారణ అనంతరం ఆమెను ఈడీ అరెస్టు చేస్తుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌షా తెలంగాణకు వస్తుండడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ మరింత అప్రమత్తమైంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

అటు కవిత ఢిల్లీ వెళ్లారు. ఇటు కేసీఆర్ అత్యసరంగా మంతివర్గం భేటీ కావాలని ఆదేశించారు. వాస్తవానికి విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఉన్నఫలంగా మంత్రివర్గం భేటీ అవుతుంది. లేకపోతే ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల ఆమోదం కోసం మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవడం ఆనవాయితీ. కానీ ఎలాంటి ఎమర్జన్సీ వాతావరణం రాష్ట్రంలో లేదు. కవితను విచారణకు రావాలని ఈడీ కోరడం.. ఆమె తనకు సమయం కావాలని విజ్ఞప్తి చేయడం.. ఇంతలోనే ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం కవిత ఢిల్లీ వెళ్లడం ఇవన్నీ గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. కవిత ఢిల్లీ బయలుదేరిన వెంటనే మంత్రివర్గం భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసులో కవితను అరెస్టు చేస్తే.. బీఆర్‌ఎస్‌ పరంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకే మంత్రివర్గం భేటీ అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. కవితను అరెస్ట్ చేస్తే ఆ తర్వాత రూపొందించే కార్యక్రమాలపై కేసీఆర్ దృష్టిపెట్టారని, ఈ భేటీలో కార్యచరణ కూడా రూపొందించుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ (CM KCR) మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పార్టీశ్రేణులను అప్రమత్తం చేయడంపై మంత్రులకు పలు సూచనలు చేస్తారని సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎండగడుతూ ఉద్యమించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చే అవకాశాలున్నాయి. అలాగే.. ప్రతిపక్ష పార్టీలు పరిపాలించే రాష్ట్రాలపై బీజేపీ (BJP) ధోరణి ఎలా ఉంది, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఆదేశించవచ్చని సమాచారం.

ముందే గ్రహించిన కేసీఆర్‌!

సిసోడియా అరెస్టుతో జరగబోయేది గ్రహించినందువల్లే.. సీఎం కేసీఆర్‌ ఈ అరెస్టును ఖండిస్తూ 8 మంది ప్రతిపక్షాల నేతలతో కలిసి మోదీకి లేఖ రాశారని, కానీ.. మోదీ సర్కారు వేగంగా రంగంలోకి దిగేందుకు ఈ లేఖే ప్రేరణ కలిగించిందని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లేఖతో కవిత అరెస్టును కేసీఆరే మరింత వేగవంతం చేశారని అంటున్నాయి. అయితే కవిత ఒకవేళ అరెస్టయితే రాజకీయంగా తమకే ప్రయోజనం కలుగుతుందని కేసీఆర్‌ అంచనా వేసి ఉండవచ్చునని, కానీ.. ఆ అవకాశాలు లేవని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏ రాజకీయ నాయకుడూ ప్రయోజనం పొందిన దాఖలాలు లేవనడానికి వారు అనేక ఉదాహరణలు చూపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న సానుభూతిని వాడుకుంటూ తనకు ఒకసారి చాన్స్‌ ఇవ్వాలని ప్రాధేయపడి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ కూడా అవినీతి కేసులు తేలి శిక్షపడితే రాజకీయంగా దెబ్బతినే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. అవినీతి కేసులు ఏ రకంగానూ రాజకీయ పార్టీల పట్ల సానుభూతి కలిగించే అవకాశాలు లేవని తేలినందువల్లే మోదీ సర్కారు విపక్ష నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలపై దృష్టి మళ్లిస్తోందని అంటున్నారు.

Updated Date - 2023-03-09T20:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising