ప్రభుత్వాలను కూల్చేపనిలో కేంద్రం
ABN , First Publish Date - 2023-03-26T00:38:47+05:30 IST
ప్రజా సంక్షేమాన్ని, దేశ సమగ్రతను విస్మరించి తమ అడుగులకు మడుగులొత్తని ప్రభుత్వాలను కూల్చేపనిలో కేంద్రం నిమగ్నమైందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంలో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్యే ౖచిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బం డా నరేందర్‌రెడ్డిలతో కలిసి పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసిందని ధ్వజమెత్తారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
నార్కట్‌పల్లి, మార్చి 25: ప్రజా సంక్షేమాన్ని, దేశ సమగ్రతను విస్మరించి తమ అడుగులకు మడుగులొత్తని ప్రభుత్వాలను కూల్చేపనిలో కేంద్రం నిమగ్నమైందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంలో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్యే ౖచిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బం డా నరేందర్‌రెడ్డిలతో కలిసి పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసిందని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో పేదరిక నిర్మూలన కోసం ఒక్కటంటే ఒక్కటైనా సంక్షేమ పథకం వచ్చిందా అని బీజేపీ నాయకులను నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదురొనే దమ్ములేక సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్‌ఐఏ లాంటి రాజ్యాంగ సంస్థలను ఉసిగొల్పి వాటిని కేంద్రం తమ జేబు సంస్థలుగా మార్చిందని ఘాటుగా ధ్వజమెత్తారు. దేశ సంపద ను కొల్లగొట్టి విదేశాల్లో విలాసవంత జీవితం గడుపుతున్న మోదీ పేరున్న బడాచోరులను సామెతలా ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టి కోర్డు తీర్పుతో నెపంతో పదవినుంచి హుటాహుటిన తొలగించి బీజేపీ ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. ఆ మాటకొస్తే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు సీఎం కేసీఆర్‌ను తూలనాడుతున్న తీరును భాషను పరిశీలిస్తే వారిపై కూడా కేసులు పెట్టలేమా ఆలోచించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఉచిత కరెంటు, రైతుబంధు, భీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కేసీఆర్ చేసిన సంక్షేమ పాలనను ప్రజల్లోకి మరింత తీసుకుపోయేందుకే ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపినా దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఉమ్మడి జిల్లాలోని 12స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలవడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ కొండూరు శంకరయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బద్దం వరలక్ష్మీరాంరెడ్డి, ఈద మాధవి, మేకల రాజిరెడ్డి, పుల్లెంల ముత్తయ్య, చిరుమర్తి యాదయ్య, వాజిద్, కనుకు అంజయ్య, దుబ్బాక శ్రీధర్, కసిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, యానాల అశోక్‌రెడ్డి, కమ్మంపాటి వెంకటయ్య, సత్తయ్య, వెంకట్, రవి ఉన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎ్‌సదే అధికారం
తిరుమలగిరి(సాగర్) : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మూడవసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపడుతున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని సర్వేలు బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని అన్నారు. 2014లో ఉద్యమ నాయకుడిగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు. ఈ క్రమంలోనే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంన్నారు.. వ్యవసాయానికి పెట్టుబడిసాయం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రైతుబీమా, కోట్లాది రూపాయలు వెచ్చించి సాగు నీటి ప్రాజెక్టుల పూర్తి చేశారన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. 35ఏళ్లు అధికారంలో ఉన్న జానారెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీలేదని, 70 ఏళ్ల వయస్సులో ఆయన చేయబోయేది ఏమీలేదని ఎద్దేవా చేశారు. పార్టీలో కొనసాగుతూ పదవులు పొంది పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండవచ్చు కాని గ్రూపులను ప్రోత్సహించడం సరైందికాదన్నారు. ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ మండలంలో పోడు భూముల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలు త్వరలోనే సేకరిస్తామన్నారు. కొందరు మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని వాటిలో ఎలాంటి కట్టడాలను కట్టనీయబోమని స్పష్టం చేశారు. కొందరు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను కట్టి తీరుతామన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అఽధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య, హాలియా మార్కెట్ ఛైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీలు చవ్వా బ్రహ్మానందరెడ్డి, అనుముల ఏడుకొండలు, పెద్దవూర పీఏసీఎస్ ఛైర్మన్ గుంటుక వెంకట్‌రెడ్డి, కర్నా బ్రహ్మారెడ్డి, నాయకులు పోతుగంటి తిరుమల్, శాగం అంజిరెడ్డి, చవ్వా నాసర్‌రెడ్డి, నాగెళ్ల వెంకట్‌రెడ్డి, గజ్జెల శ్రీనివా్‌సరె డ్డి, జంగాల లక్ష్మమ్మ, పురుషోత్తంయాదవ్, ముత్తయ్య, నగేష్, శ్రీనివా్‌సరెడ్డి, బగ్గు, హరికృష్ణ, చందర్, హరిసింగ్, మరియమ్మ, రాజే్‌షనాయక్ పాల్గొన్నారు.