ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponguleti: సీఎం కేసీఆర్‌పై పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ సభను ఆపేందుకు..

ABN, First Publish Date - 2023-07-22T20:30:33+05:30

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది అన్నది కేసీఆర్ మర్చిపోతున్నారు.

ఖమ్మం జిల్లా: సత్తుపల్లిలో కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై (CM KCR) ఆగ్రహం వ్యక్తం చేశారు.


"తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది అన్నది కేసీఆర్ మర్చిపోతున్నారు. వేలాది మంది ఆత్మ బలి దానాలు, పోరాటాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఖమ్మంలో రాహుల్ గాంధీ సభను ఆపేందుకు ఫామ్ హౌస్‌లో కూర్చుని కేసీఆర్ ప్లాన్ వేశారు. 2014 ముందు, తరువాత కల్వకుంట్ల ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. లక్షల కోట్లు సంపాదించి ఉండకపోతే ప్రధాన పదవికి ఖర్చు పెడతా అంటాడా కేసీఆర్. పరిపాలనపై నమ్మకం ఉంటే ఇప్పుడు ఉన్న 103 మంది ఎమ్మెల్యేలకు బి ఫామ్ ఇవ్వాలని సవాల్ విసిరితే ఒక్కరూ నోరు మెదపలేదు. కేసీఆర్‌కు మించిన దొర సత్తుపల్లి ఎమ్మెల్యే. అధికార పార్టీ నేతలు చేసిన దందాలను నడి రోడ్‌పై కక్కిస్తాం. అందరి లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వాన్ని గోతిలో పెట్టటమే. కాంగ్రెస్ నాయకులతో కలిసి సామాన్య కార్యకర్తగా పనిచేస్తా." అని పొంగులేటి అన్నారు.

Updated Date - 2023-07-22T20:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising