HYD: ఎన్నికల వేళ... మామిడితోటలో మస్త్ దావత్.. మద్యం ఏరులై పారిందంటూ..
ABN, First Publish Date - 2023-11-15T09:05:42+05:30
మేడ్చల్ నియోజకవర్గం జవహర్నగర్(Jawaharnagar)లోని ఓ మామిడి తోటలో మంగళవారం రాత్రి ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన పార్టీ
- అధికారులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- కేసు నమోదు
జవహర్నగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ నియోజకవర్గం జవహర్నగర్(Jawaharnagar)లోని ఓ మామిడి తోటలో మంగళవారం రాత్రి ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్(BRS, Congress) పార్టీల్లో వేడిని రగిలించింది. మద్యం(Alcohol) ఏరులై పారిన ఈ పార్టీపై ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ విందుకు జవహర్నగ్లోని పలువురు నాయకులు, ప్రముఖులు, కాలనీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు హాజరైనట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మామిడితోటలో మందు, విందు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభ పెట్టి తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి పోలీసులకు సమాచారం అందించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ ఓ వ్యక్తిపై జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - 2023-11-15T09:05:43+05:30 IST