HYD: ఈ ఐదేళ్లలో ఎంపీగా రేవంత్‌రెడ్డి చేసింది శూన్యమే...
ABN, First Publish Date - 2023-10-31T09:59:03+05:30
మల్కాజిగిరి ఎంపీగా ఐదు సంవత్సరాల్లో రేవంత్‌రెడ్డి ప్రజలకు చేసిన మేలు ఏందో చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ
- బీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి
మౌలాలి(సికింద్రాబాద్), (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి ఎంపీగా ఐదు సంవత్సరాల్లో రేవంత్‌రెడ్డి ప్రజలకు చేసిన మేలు ఏందో చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి(Marri Rajasekhar Reddy) డిమాండ్ చేశారు. సోమవారం గౌతంనగర్ డివిజన్‌లోని జ్యోతినగర్‌కాలనీలో సంక్షేమ సంఘ భవనంలో పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మర్రి మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రమాద బీమాను అందించేలా చర్యలుతీసుకుందని అలాగే వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గౌతంనగర్ డివిజన్ కమ్యూనిటీహాల్‌లో సీనియర్ సిటిజన్‌తో జరిగిన సమావేశంలో మర్రి మాట్లాడుతూ బీఆర్‌ఎ్‌సతోనే సబ్బండవర్గాల సంక్షేమం సాధ్యమైందన్నారు. ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి గత 5 సంవత్సరాలుగా మల్కాజిగిరి ప్రజలకు చేసింది ఎందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంత ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) చోరవతోనే సాగిందన్నారు. రానున్న రోజులలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తనకు అవకాశం ఇవ్వాలని, కారు గుర్తకు ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు. అంతకుముందు జేఎల్‌ఎన్‌ఎస్ నగర్ కాలనీలోని జయగిరి లక్ష్మీనర్సింహ్మస్వామీ ఆలయంలో కార్పొరేటర్ మేకల సునీతరాము యాదవ్, సర్కిల్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డితో కలిసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణగౌడ్, నాయకులు జేఏసీ వెంకన్న, బైరు అనీల్, సత్యనారాయణ, సిద్ధి రాములు, పరమేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-31T09:59:03+05:30 IST