ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HYD: కాంగ్రెస్‌ అభ్యర్థి సంచలన కామెంట్స్.. హైదరాబాద్‌ అభివృద్ధి చంద్రబాబు పుణ్యమే!

ABN, First Publish Date - 2023-11-04T11:16:37+05:30

హైదరాబాద్‌(Hyderabad) అభివృద్ధి అంటే కేసీఆర్‌ ఘనత కాదు.. 2020 విజన్‌ ఉన్న

- కూకట్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బండి రమేష్‌

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌(Hyderabad) అభివృద్ధి అంటే కేసీఆర్‌ ఘనత కాదు.. 2020 విజన్‌ ఉన్న చంద్రబాబుదే అని కూకట్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బండి రమేష్‌(Bandi Ramesh) అన్నారు. ఈ మేరకు శుక్రవారం కేపీహెచ్‌బీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. హైటెక్‌సిటీ నిర్మాణం, శంషాబాద్‌లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రోకు అంకుర్పారణ చేసింది చంద్రబాబు కాదా? వాటిని పట్టాలెక్కించింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాదా? సికింద్రాబాద్‌, మెహిదీపట్నం(Secunderabad, Mehdipatnam) వద్ద ఫ్లైవోవర్లు అప్పట్లో వేయలేదా ? అని బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా.. డిబేట్‌లో నేను చర్చకు సిద్ధం అన్నారు. నగర అభివృద్ధిలో చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి చేసిన పనులను కొనసాగించడం వల్ల సుందరమైన నగరంగా తయారైందని, ఏపీలో మాదిరిగా అభివృద్ధిని ఆపకుండా కొనసాగించారే తప్ప కొత్తగా నగర అభివృద్ధికి మీరు చేసేందేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందనే వారికి నాగార్జునసాగర్‌ ఎవరి హయాంలో నిర్మించారు? కృష్ణా నీటిని హైదరాబాద్‌కు తాగటానికి తీసుకొచ్చింది ఎవరు అని బీఆర్‌ఎ్‌సను ప్రశ్నించారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే మళ్లీ తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-04T11:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising