ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. ఏ రూట్లలో అంటే..!

ABN, First Publish Date - 2023-09-20T16:46:03+05:30

గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు.

హైదరాబాద్: గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు. ‘‘రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా అందించాలి. టీఎస్ఆర్టీసీ ఎన్ని కష్టాల్లో ఉన్న ప్రయాణికుల సంక్షేమమే ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్‌లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని బస్సులు ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలి. ఐటీ కారిడార్‌లోనే కాదు. కోకాపేట, ఎల్బీ నగర్‌తో హైదరబాద్ చుట్టూ ప్రక్కల ఉన్న ప్రాంతాల నుంచి నడపాలి. అలాగే మెట్రోకు వీటిని అనుసంధానం చేయాలి. అన్ని వైపులా ఇవే నడపాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. కేంద్రం నుంచి సబ్సిడీ గతంలో వచ్చేది కానీ ఇప్పుడు అది కూడా తీసేసింది కేంద్రం. సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది. రాష్ట్రంలో యూవీ పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుంది. కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించాలి. కోటి 52 లక్షల వాహనాలు తెలంగాణలో ఉన్నాయి. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ దిశగా మార్చాలి. ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన సమస్య తీరింది. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాం. మరో నెలలో ఈ ప్రొసెస్ కూడా పూర్తవుతుంది. రవాణా శాఖ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించి ఐదేళ్లు అవుతుంది. అనేక ఒడిదుడుగులు ఎదుర్కొన్నా.’’ అని మంత్రి తెలిపారు.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

‘‘కొత్తగా నగరంలోకి 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్‌తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరు నెలల్లో నడుపుతాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.’’ అని సజ్జనార్ వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల రూట్లు ఇవే..

వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రాబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఏసీ బస్సులు నడవనున్నాయి. అలాగే సీసీ కెమెరాలు, ప్రయాణికులకు చార్జింగ్ సదుపాయం లాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-09-20T16:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising