ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: మలక్‌పేటలో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం

ABN, Publish Date - Dec 25 , 2023 | 05:25 PM

నగరంలోని మలక్‌పేట ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం అయింది. అదృశ్యం అయిన వారిని వరాహమూర్తి, దుర్గ దంపతులుగా తెలుస్తోంది. అయితే వీరు హైదరాబాద్‌లోని మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్‌లో నివశిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఓ అబ్బాయి సత్య భైరవ ఉన్నారు. ముగ్గురు కూతుర్లకు దంపతులు పెళ్లిళ్లు చేశారు. మహమ్మద్ ఖాన్ జ్యూవెలరీ షాప్‌లో తండ్రి కొడుకులు ఉద్యోగం చేస్తున్నారు.

హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం అయింది. అదృశ్యం అయిన వారిని వరాహమూర్తి, దుర్గ దంపతులుగా తెలుస్తోంది. అయితే వీరు హైదరాబాద్‌లోని మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్‌లో నివశిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఓ అబ్బాయి సత్య భైరవ ఉన్నారు. ముగ్గురు కూతుర్లకు దంపతులు పెళ్లిళ్లు చేశారు. మహమ్మద్ ఖాన్ జ్యూవెలరీ షాప్‌లో తండ్రి కొడుకులు ఉద్యోగం చేస్తున్నారు. సుమారు 50లక్షల వరకు అప్పులు చేయడంతో తండ్రీకొడుకులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ జీవనం సాగిస్తున్నారు. వడ్డీలు పెద్ద మొత్తంలో ఉండడంతో అవి కట్టి కట్టి మరీ అప్పుల లోతులోకి కుటుంబం కూరుకుపోయింది. ప్రత్యామ్నాయ మార్గం లేక కుటుంబసభ్యులు చావుకు సిద్ధమయ్యారు. "మాకు చావు తప్ప వేరే మార్గం లేదు క్షమించండి, మా చావుకు ఎవరు బాద్యులు కారు అంటూ" ఓ లెటర్ రాసి అదృశ్యం అయ్యారు. ఇంట్లో ఈ నెల 20వ తేదీ రోజు ఓ పేపర్ పైన రాసి సెల్ ఫోన్లు ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కూతురు చాముండేశ్వరి మలక్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Dec 25 , 2023 | 05:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising