Garikapati Narasimha Rao: ‘గరికపాటి’కి అరుదైన గుర్తింపు
ABN , First Publish Date - 2023-01-15T08:32:21+05:30 IST
సుప్రసిద్ధ అవధాని గరికపాటి నరసింహారావుకు అరుదైన గుర్తింపు లభించింది. విశ్వఖ్యాతి
హైదరాబాద్/నల్లకుంట: సుప్రసిద్ధ అవధాని గరికపాటి నరసింహారావుకు అరుదైన గుర్తింపు లభించింది. విశ్వఖ్యాతి చెందిన భారత్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన పేరు నమోదైంది. రికార్డ్స్ అధ్యక్షుడు కేవీ రమణారావు, భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లలితారావు, జాతీయ సమన్వయకర్త మాగంటి విష్ణు తేజ తదితరులు శనివారం గరికపాటి ఇంటికి చేరుకొని అభినందనలు తెలిపారు. భారత్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసిన ధ్రువపత్రాన్ని కలశపూడి శ్రీనివాసరావు, మాగంటి వసుధ సమక్షంలో గరికపాటికి వారు అందజేశారు.