RK Math: ఘనంగా ఆర్యజనని 5వ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2023-03-12T20:35:33+05:30 IST

పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శమూర్తులని... తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి పిల్లలు అన్ని విషయాలు నేర్చుకుంటారని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు.

RK Math: ఘనంగా ఆర్యజనని 5వ వార్షికోత్సవం

హైదరాబాద్: పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శమూర్తులని... తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి పిల్లలు అన్ని విషయాలు నేర్చుకుంటారని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం (Ramakrishna Math) వివేకానంద (Vivekananda) ఆడిటోరియంలో ఆర్యజనని 5వ వార్షికోత్సవ (Aryajanani 5th Anniversary) వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ధర్మాచరణలో మంచితనంపై సంపూర్ణ విశ్వాసం ఉండాలన్నారు. సంకుచిత స్వభావాలు వీడి ఆధ్యాత్మికతకు సంబంధించి మరింత సానుకూల వాతావరణం ఏర్పరచుకోవాలని స్వామి బోధమయానంద సూచించారు.

rk.jpg

ఆర్య జనని కార్యక్రమాల వ్యాప్తి గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరాలని ఆయన సూచించారు. ఆదర్శవంతమైన జీవనం గడిపిన స్వామి వివేకానంద, శ్రీ రామకృష్ణ పరమహంస, బుద్ధుడు, శంకరాచార్య, రమణ మహర్షి వంటి వారి జీవిత గాధలను పిల్లలకు పరిచయం చేయాలన్నారు. సత్ సంతానం కోసం గర్భిణులకు ఒత్తిడి లేని వాతావరణం కల్పించాలని ఆయన సూచించారు. ఆర్య జనని వర్క్ షాప్‌లకు హాజరు కావడం ద్వారా ఉత్తమ భవిష్యత్ తరాలను అందించవచ్చు అన్నారు. ప్రార్థనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చెప్పారు.

rk1.jpg

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆర్యజనని కార్యక్రమం స్ఫూర్తి రాష్ట్రమంతటా వ్యాపించాలన్నారు. అన్ని మెడికల్ కాలేజీలకు ఆర్య జనని ప్రాధాన్యతను తెలియజేస్తూ లేఖలు రాస్తా అన్నారు. ఆర్యజనని కార్యదర్శి డాక్టర్ అనుపమ రెడ్డి మాట్లాడుతూ ఆర్యజనని వర్క్‌షాప్‌ల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు.

తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వచ్చిన వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, మేధావులు, ఆర్యజనని తల్లిదండ్రులు, ఆర్యజనని బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Updated Date - 2023-03-12T20:38:45+05:30 IST