ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే..!

ABN, First Publish Date - 2023-08-03T14:56:07+05:30

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్‌కు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణానికి తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (TS Assembly) గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్‌కు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణానికి తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి (శుక్రవారం) వాయిదా పడింది.

శాసనసభ వాయిదా అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మూడు రోజులే నిర్వహించాలని ఫైనల్‌గా ప్రభుత్వం డిసైడ్ చేసింది. 4న (శుక్రవారం) వరదలపై చర్చ, 5న బిల్లులపై చర్చించాలని నిర్ణయించారు. ఆదివారం 6న సమావేశాలు ముగించనున్నారు.

Updated Date - 2023-08-03T14:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising