ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhatti Vikramarka : అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు వ్యంగంగా మాట్లాడడం తప్ప.. సమస్యలకు పరిష్కరం చూపారా?

ABN, First Publish Date - 2023-08-05T21:53:08+05:30

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) జరిగిన తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని అనిపిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) జరిగిన తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని అనిపిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుడతూ.. 60 రోజులు జరగాల్సిన సభ 10 రోజులకు పడిపోయిందన్నారు. ప్రతిపక్షాలు(Opposition parties) లేవనెత్తిన సమస్యలపై మంత్రి కేటీఆర్(Minister KTR) అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల(BRS leaders) వ్యంగంగా మాట్లాడటం చూస్తుంటే.. సభకు ఎందుకు వస్తున్నామా..? అని పిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు వ్యంగంగా మాట్లాడడం తప్ప సమస్యలకు పరిష్కరం చూపించలేరా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వర్షం వస్తే మునిగిపోతుంది అని చెప్పామని.. దానిని కూడా బీఆర్ఎస్ నేతలు తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారని చెప్పారు. ORR అతితక్కువ ధరలకు ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.


హైదరాబాద్(Hyderabad): గ్రామపంచాయతీల(Gram Panchayats)కు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలు అంటే మంత్రి కేటీఆర్‌(Minister KTR)కు అంత చిన్నచూపు ఎందుకని నిలదీశారు.సభ నడిపే విధానం ఇది కాదని.. అసెంబ్లీ స్పీకర్‌( Assembly Speaker)ని రేపు కలుస్తామని చెప్పారు. సభను ఇలా వదిలేస్తే.. ప్రజాస్వామ్యం ఎటు పోతుందోనని భయమేస్తోందన్నారు. తాము ఆవేదనతో మాట్లాడుతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఉండేది రెండు నెలలేనని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) వచ్చాకా.. మీ తప్పులు బయట పెడతామని హెచ్చరించారు.TSRTCని ప్రభుత్వంలో విలీనం చేయాలని తాము అడిగితే తలకాయ ఉన్నోడు ఆ పని చేయడని కేసీఆర్(KCR) అన్నారు .. ఇప్పుడు ఎన్నికలు(Elections) దగ్గర పడ్డాయని ఈ ప్రకటన చేశారని చెప్పారు. పెండింగ్‌లో పడేట్టు చేసి..తప్పించుకునే పనిలో కేసీఆర్ కుంటిసాకులు వెతుకుతున్నారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

Updated Date - 2023-08-05T21:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising