Rajasingh: ప్రమాణ స్వీకారం చేయనంటున్న రాజాసింగ్.. కారణమిదే
ABN, First Publish Date - 2023-12-08T16:28:02+05:30
Telangana:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. రేపు ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానున్నాయి. రేపు కొత్త ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ప్రమాణస్వీకారం చేసేది లేదని తేల్చిచెప్పారు. రజాకార్ల వారుసులైన ఎంఐఎం నేత సమక్షంలో ఓథ్ తీసుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు.2018లో కూడా ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ఉన్నందున ప్రమాణం చేయలేదని... ఈసారి కూడా అదే నిర్ణయం ఉంటుందని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) అధ్యక్షతన రేపు (శనివారం) బీజెఎల్పీ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరుగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే ప్రమాణ స్వీకారంపై రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో మిగతా 7 మంది ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాక కిషన్‌రెడ్డి విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Updated Date - 2023-12-08T16:38:12+05:30 IST