ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: నిర్మల్‌లో అటవీభూమిని ఈద్గాకు కేటాయించడంపై బండి సంజయ్ ఆగ్రహం

ABN, First Publish Date - 2023-04-18T11:06:13+05:30

నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ( Telangana BJP Chief Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు (CM KCR) బీజేపీ నేత లేఖ రాశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తు తాకట్టు పెట్టి స్వార్థ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం భూమి కేటాయించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించొద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా చించోలిలో ఈద్గాను నిర్మించడం న్యాయ వ్యవస్థను అవమానించడమే అని.. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని అన్నారు.

హిందూ దేవాలయాలకు సమీపంలోనే ఈద్గా ప్రార్థనలకు భూమి కేటాయించడం ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకే అని భావించాల్సి వస్తోందన్నారు. ఓట్ల కోసం విద్యార్థుల ప్రయోజనాలను పక్కనపెట్టి ఒక మతానికి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం తమ స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. చట్ట విరుద్ధమైన భూమిలో ఈద్గా నిర్మాణం ప్రారంభానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Revenue Minister Indrakaran Reddy), ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ (Deputy Chief Minister Mahmood Ali) వెళ్తుడటం బాధాకరమని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును బలి చేసే చర్యలను తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు బేఖాతారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంద అంటూ బండి సంజయ్ లేఖ‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-18T11:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising