DK Aruna: మోదీకి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ ఎకసెక్కాలు ఆడుతోంది
ABN, First Publish Date - 2023-09-19T13:31:30+05:30
కాంగ్రెస్ పార్టీతో ఉన్న వారే మతచిచ్చు రేపుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నాలుగు వేల సంవత్సరాల చరిత్ర సనాతన ధర్మంకు ఉందన్నారు. ఈ దేశం అన్ని కులమతాలను గౌరవిస్తుందని తెలిపారు. అలాంటి దేశంలో అతి పురాతనమైన సనాతన ధర్మం లేకుండా చేస్తామంటున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో ఉన్న వారే మతచిచ్చు రేపుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నాలుగు వేల సంవత్సరాల చరిత్ర సనాతన ధర్మంకు ఉందన్నారు. ఈ దేశం అన్ని కులమతాలను గౌరవిస్తుందని తెలిపారు. అలాంటి దేశంలో అతి పురాతనమైన సనాతన ధర్మం లేకుండా చేస్తామంటున్నారని మండిపడ్డారు. దేశాభివృద్ధికి ఆటంకాలు కలగాలని కాంగ్రెస్ పార్టీ చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ విద్వేషాలు రెచ్చగొట్టే లా మాట్లాడారన్నారు. ప్రపంచంలో మోదీకి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ నేతలు ఎకసెక్కాలు ఆడుతున్నారని విమర్శించారు. గాంధీ పేరు పెట్టుకుని ఇన్నాళ్లు దేశాన్ని ఏలినా పేదరికం నిర్మూలించలేదన్నారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విశ్వాసం కోల్పోయిందన్నారు. మతచిచ్చు రేపి రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. తెలంగాణపై, దేశంపై కాంగ్రెస్‌కు ఏమాత్రం ప్రేమ లేదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఉచిత పథకాలతో ఎలాంటి అభివృద్ధి జరగదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారన్నారు. తెలంగాణ ప్రజలు భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నారా అని బీజేపీ నేత నిలదీశారు.
మహిళలను గౌరవించమని మీ నాన్నకు చెప్పు కవిత..
తెలంగాణలో ఆర్టీసీని ఏ స్థాయికి తీసుకువచ్చారో.. కర్ణాటకలో ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కర్ణాటకలో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ‘‘మా ఎమ్మెల్యేలు పార్టీ మారరు, మేం అధికారంలోకి వస్తే స్కాంలు ఉండవు అనే గ్యారెంటీ ఇవ్వం. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయం అనే హామీ ఇవ్వండి’’ అని అన్నారు. ఓట్లకోసం పథకాలు తెచ్చే నేత మోదీ కాదన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్ళడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అనే విషయాలను బీజేపీ తెప్పించుకుంటుందన్నారు. అందుకు అణుగుణంగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు. కవిత లేఖ రాస్తేనే మోదీ మహిళా బిల్లు పెడుతున్నట్టు చెబుతోందన్నారు. ఒక పథకం ప్రకారం మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉందని గతంలోనే చెప్పామన్నారు. కవిత వ్యవహారం చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘మహిళలను గౌరవించమని మీ నాన్నకు చెప్పు మొదలు. మీ పార్టీ మహిళలకు కానీసం 15 రిజర్వేషన్ అమలు చేశారా.. పార్టీలో ఓ మహిళకు అత్యున్నత పదవి ఇచ్చారా. ఎంతో కష్టపడి నేను రాజకీయాలలో ఎదిగాను. నేను రాజకీయ వారసురాలుగా ఎదగలేదు’’ అని అన్నారు. ఇండ్లు కేంద్ర ప్రభుత్వం విధులతో కడతారా... రాష్ట్ర నిధులతో కడతారో కూడా కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో , రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రానికి తగిన న్యాయం జరుగుతుందన్నారు. ఒకేసారి బీజేపీకి తెలంగాణలో అధికారం ఇవ్వాలన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పథకాలు చూసి బీజేపీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు తోడు దొంగలు అంటూ డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-09-19T13:31:30+05:30 IST