ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komatireddy: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-18T13:52:49+05:30

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (Komatireddy Rajgopal reddy) ఖండించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాదు అని ఒక పత్రిక తాను అన్నట్లు వార్తలను రాస్తోందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఎక్కడా ఈ మాటలు అనలేదని... కథనాలు సృష్టించి వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై ఉపఎన్నికలలో దుష్ప్రచారం చేసి ఓటమి చెందేటట్లు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించారని దుయ్యబట్టారు. కర్నాటక ఫలితాల తర్వాత కొంత మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రులు తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని తనను అడుగుతున్న మాట వాస్తవమే అని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్‌లో గెలవాలని లేదన్నారు. కేంద్రంలో అధికారంలో లేకుండా, బలమైన నాయకత్వం లేకుండా తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించడం సాధ్యం కాదని అన్నారు.

నాపై ఆ ప్రచారాన్ని నమొద్దు...

రేవంత్ రెడ్డి, ఉత్తమ్ (Uttamkumar reddy), జానా రెడ్డి (Janareddy), మల్లు భట్టి విక్రమార్కల (Mallu Bhattivikramarka) ఆధ్వర్యంలో నాలుగు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎన్నికలు జరగలేదు, ఫలితాలు రాలేదు అప్పుడే నాలుగు గ్రూపులు తమ నేత ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలుపెట్టాయని యెద్దేవా చేశారు. తనకు పదవులు అవసరం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు (BRS) ప్రత్యామ్నాయం బీజేపీ (BJP) అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉందని... తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని తెలిపారు. బీజేపీలో చేరకలు పెద్దఎత్తున ఉంటాయని చెప్పారు. ‘‘నాపై అపవాదులు, దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని కోరుతున్నాను. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం సునీల్‌ బన్సాల్‌తో నిన్న రాత్రి గంటకు పైగా చర్చించాను. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారు. అధ్యక్ష పదవి కోసం ఎవ్వరూ లాబీయింగ్ చెయ్యడం లేదు.ఎన్నికల సంవత్సరం కాబట్టి బండి సంజయ్‌ను అధిష్టానం కొనసాగిస్తుంది. లేదంటే ఆయనకు వేరే భాధ్యతలు ఇస్తారు. అంతిమ నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది. బీజేపీని బలహీనపరిచే కుట్ర జరుగుతుంది. వారి కుట్రలు సాగవు’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-18T14:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising