ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP MP: తెలంగాణ సమాజానికి తెలుసు కేసీఆర్ బ్రోకర్.. మా నాన్న పెద్దమనిషని

ABN, First Publish Date - 2023-01-30T15:04:43+05:30

మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ అరవింద్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మంత్రి కేటీఆర్‌ (Telangana Minister KTR) పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (BJP MP Dharmapuri Arvind) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ (Telangana Minister)ఇందురుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పసుపు బోర్డు కంటే మెరుగైన బోర్డు తెచ్చామని.. దొరతనాన్ని తరిమి కొడతామని తెలిపారు. ‘‘తెలంగాణ (Telangana) సమాజానికి తెలుసు కేసీఆర్ (CM KCR) బ్రోకర్ అని మా నాన్న పెద్దమనిషి అని’’ అని అన్నారు. నిజమాబాద్‌కు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేటీఆర్ బ్రోకర్ పనులు ఎలా చేస్తారో చెప్తాను. మీ లాగా ఏమైనా దోచుకున్నామా... విద్య, వైద్యంపై ఏమైనా ఆలోచన ఉందా’’ అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ (CM Kalvakuntla Chandrasheker Rao) ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇళ్ళ జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామన్న హామీ గాలికి వదిలేసారన్నారు. ఎన్నికల హామీలు తప్ప, ఆచరణలో చేసింది శూన్యమని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) లో కమిషన్లు తిన్నారని, కాబట్టే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం లేదన్నారు. తమరు డీపీఆర్ ఇస్తే, జాతీయ హోదా (National status) తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. మహిళా గవర్నర్‌ (Telangana Governor)పై అసభ్య పదజాలంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే (TRS MlAs) లు దూషిస్తున్నారని... ఇదేనా టీఆర్ఎస్ సంస్కృతి అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జీవితమే బాగైంది తప్ప, సామాన్య ప్రజల జీవితం దిగజారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమన్నారు. చేనేత జీఎస్టీ (GST)లో రాష్ట్ర వాటా కట్ చేసి, ఆ తరువాత జీఎస్టీ గురించి మాట్లాడాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ రేటు (Petrol and Diesel Rate) ఎక్కువగా ఉన్నాయని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-01-30T15:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising