ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Danam Nagender: శ్వేత పత్రాలు సభలో పెట్టి గెలుక్కున్నట్లు ఉంది

ABN, Publish Date - Dec 21 , 2023 | 11:48 AM

Telangana: శ్వేత పత్రాలు సభలో పెట్టి గెలుక్కున్నట్లు ఉందని... తమను గెలికి తిట్టించుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: శ్వేత పత్రాలు సభలో పెట్టి గెలుక్కున్నట్లు ఉందని... తమను గెలికి తిట్టించుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (BRS MLA Danam Nagender) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో నిర్వహిస్తున్న చిట్‌చాట్‌లో దానం మాట్లాడుతూ.. సభలో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందన్నారు. పథకాలు ఆలస్యంగా అమలు చేయడానికే శ్వేతపత్రం అని మొదలు పెట్టారన్నారు. ప్రభుత్వం అప్పులు బయటపెడితే భవిషత్ ఇబ్బంది అవుతుందన్నారు. హరీష్ రావు, కేటీఆర్‌కు మంత్రుల కౌంటర్ సరిపోవడం లేదన్నారు. ఇరిగేషన్‌పై హరీష్ ఉతికి ఆరేస్తరన్నారు. మంత్రులు అసలు విషయాలు చెప్పకుండా పైపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ పరిపాలనలో జాగ్రత్తగా వెళుతున్నారని.. సీఎం పదవి రేవంత్ చిరకాల వాంఛ అని అన్నారు. రేవంత్ .. అంత ఈజీగా వదులుకోరన్నారు. లక్ష్యం పెట్టుకుని.. రేవంత్ సీఎం అయ్యారని తెలిపారు. ‘‘రెండేళ్ల క్రితమే కాంగ్రెస్ సీనియర్‌లు రిటైర్డ్ అవుతరు. నేనే సీఎం అని చెప్పాడు. మా ఎమ్మెల్యేలు కొందరు ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అనడం సరికాదు.. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారు’’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 21 , 2023 | 11:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising