ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS : అవినీతి కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ.. బొత్స ఖబడ్దార్.. ఏపీపీఎస్సీ కాదు.. ఛీపీపీఎస్సీ..

ABN, First Publish Date - 2023-07-14T11:56:23+05:30

వైసీపీ నేతలకు బీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసింది. నిన్న తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే వైసీపీ నేతలను హైదరాబాద్‌కి రానివ్వబోమని స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : వైసీపీ నేతలకు బీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసింది. నిన్న తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే వైసీపీ నేతలను హైదరాబాద్‌కి రానివ్వబోమని స్పష్టం చేశారు. ఇంకోసారి తెలంగాణపై విమర్శలు చేస్తే ఆంధ్ర ప్రాంత నేతలు హైదరాబాద్‌కు రావొద్దన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి చూసి ఓర్వలేక ఆంధ్ర ప్రాంత నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.

‘‘మీరు మొనగాళ్లు అయితే ముందు మీ రాజధాని ఎక్కడో తెలుసుకోండి. అవినీతి కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ. బొత్స సత్యనారాయణ ఖబర్ధార్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. తెలంగాణలో మీ అస్తులు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీ మీద వోక్స్ వ్యాగన్ కేసులు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగనివ్వం. మీ హయాంలో ఒక్క డిగ్రీ కాలేజ్‌కు అయినా అనుమతి ఇచ్చారా? ఏపీపీఎస్సీ కాదు.. ఛీపీపీఎస్సీ అని వార్తలు వచ్చింది నిజం కాదా? ఇళ్ల కుంభకోణం, యూరియా కుంభకోణం ఇలా ప్రతిదీ ఇబ్బందే. కిలాడి లేడి ఎక్కడ అంటూ మీ పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది వాస్తవం కాదా?’’ అని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.

ఇక తెలంగాణ బీజేపీ నేతల గురించి ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ధర్మపురి అరవింద్ పెద్ద దొంగ. పసుపు బోర్డు ఎక్కడ? మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి... ఎక్కడ పన్నావ్ , మీ ప్రధానిని తెలంగాణ కు ఎన్ని మెడికల్ ఇచ్చారో అడుగు. నువ్వు మనిషివా , ఎక్కడ ఉద్యమం చేసినవ్ రోడ్డు మీద తిరిగే వానికి టికెట్ ఇస్తే ఎంపీ అయినవ్. నీ బట్టలు ఊడదీస్తాం , ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రోడ్ల మీద తిరగనివ్వం’’ అని హెచ్చరించారు.

Updated Date - 2023-07-14T11:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising