Chamala Kiran Kumar Reddy: బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది
ABN, First Publish Date - 2023-10-06T15:38:07+05:30
బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) పార్టీ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్‌రెడ్డి ( Chamala Kiran Kumar Reddy)వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) పార్టీ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్‌రెడ్డి ( Chamala Kiran Kumar Reddy)వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుల మాటలకు , చేసిన పనులకు పొంతన లేదు. కాంగ్రెస్‌ను విమర్శించడం మినహా కేటీఆర్, హరీష్‌లు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని పలు సర్వేలు స్పష్టం చేశాయి. బీఆర్ఎస్‌కు అనుకూలంగా వస్తేనే నిజమైన సర్వేలా? తెచ్చిన అప్పంతా బీఆర్ఎస్ నేతల కమీషన్లకే సరిపోయింది.
హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు డబ్బుల ఎలా పంచారో జనం మొత్తం చూశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే విషయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాఖ్యలతో స్పష్టం అయింది. బీఆర్ఎస్ నేతలు ఓటమి భయంతో ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఓట్ల కోసమే మోదీ హామీలు ఇచ్చారు. ఓట్లు చీల్చి బీఆర్ఎస్‌ను గెలిపించడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సిబ్బందికి జీతాలు ఇంకా రాలేదు. దీంతో వారు ధర్నాలు చేస్తున్నారు’’ అని కిరణ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-10-06T15:41:46+05:30 IST