కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: వర్షాలు, వరదల పరిస్థితులపై ఆరా

ABN, First Publish Date - 2023-07-28T23:37:31+05:30

ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేపట్టారు. వరద ఉధృతి తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

 CM KCR: వర్షాలు, వరదల పరిస్థితులపై ఆరా

హైదరాబాద్(Hyderabad): తెలంగాణ(Telangana)లో కుండపోతగా కురుస్తున్న వర్షాల(Heavy Rains) నేపథ్యంలో సీఎం కేసీఆర్(CM KCR) రెండో రోజు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు.శుక్రవారం వరద ముంపు(flood inundation)కు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలిచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు సూచనలిస్తూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రక్షణ, పునరావాస, సహాయ చర్యలను ముమ్మరం చేయాలన్నారు. పునారావాస కేంద్రాల్లో విస్తృతంగా సౌకర్యాలు కల్పించాలని సీఎం చెప్పారు.

సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజలకు వైద్యం, వసతి, భోజన సదుపాయాల్లో ఎలాంటి లోటు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరద ముంపు తగ్గి కుదుట పడుతున్న ప్రాంతాల్లో అంటువ్యాధుల నివారణకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముంపునకు గురయిన ప్రాంతాల్లో పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు.సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపుకు గురైన ప్రాంతాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తూ, సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో( Warangal District)ని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలు, తాగు నీరు, మందులను హెలికాప్టర్‌(Helicopter) ద్వారా అందించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Minister Errabelli Dayakar Rao) సీఎం దృష్టికి తీసుకువచ్చారు.


అలాగే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మూడోరోజూ గోదావరి ముంపునకు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలింనట్లు తెలిపారు. భారీ వర్షాలతో చెరువులు తెగడం, రహదారులు, బ్రిడ్జ్‌లు కోతకు గురయిన క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికార యంత్రాగానికి సూచనలు ఇచ్చినట్లు వివరించారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు తగ్గు ముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేపట్టారు. వరద ఉధృతి తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్నందున పలువురు మంత్రులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్ట కార్యాచరణను అనుసరించాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయ, పునరావాస చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని సీఎం కేసీఆర్‌కు అధికార యంత్రాగం తెలిపారు.సీఎం కేసీఆర్ స్వయంగా పరిస్థితులను సమీక్షిస్తుండటంతో అధికార యంత్రాంగం..సహాయక బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.

Updated Date - 2023-07-28T23:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising