ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly CM Kcr: రేపు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పీచ్.. సర్వత్రా ఉత్కంఠ!

ABN, First Publish Date - 2023-08-05T11:10:39+05:30

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆదివారం సమావేశం ప్రారంభం కాగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (TS Assembly) ఆదివారంతో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM Kcr) ప్రసంగించనున్నారు. ఆదివారం సమావేశం ప్రారంభం కాగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రేపు సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారన్న అంశంపై సర్వత్రా పొలిటికల్‌గా ఆసక్తి రేపుతోంది.

మరోవైపు ఆర్టీసీని (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసేందుకు గవర్నర్‌ తమిళిసై దగ్గరకు ఫైల్‌ను పంపించారు. కానీ అక్కడ నుంచీ క్లియరెన్స్ రాలేదు. కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సీఎస్‌కు గవర్నర్ లేఖ రాశారు. ఇలా గవర్నర్-ప్రభుత్వం మధ్య ఫైటింగ్ నడుస్తోంది. రేపటిలోగా ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ సంతకం చేయకపోతే పెండింగ్‌లో పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నడుస్తోంది.

ఇంకోవైపు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రత్యర్థులకు అవకాశాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఆయా వర్గాలకు పథకాలు ప్రకటించారు. వీఆర్ఏ‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. అటు తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.. బీసీ, మైనారిటీలకు రూ.లక్ష సాయం.. ఇలా కొత్త కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆదివారం కూడా శాసనసభలో సీఎం కేసీఆర్ మరికొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది.

Updated Date - 2023-08-05T11:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising