CM Revanth Reddy: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Dec 24 , 2023 | 06:32 PM
క్రిస్మస్ ( Christmas ) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర క్రిస్టియన్ సోదర సోదరిమనులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏసుప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం, ఎప్పటికి అనుసరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: క్రిస్మస్ ( Christmas ) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర క్రిస్టియన్ సోదర సోదరిమనులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏసుప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం, ఎప్పటికి అనుసరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా సాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సహాలతో క్రిస్మస్‌ను జరుపుకోవాలని ఆకాక్షించారు. క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరు పాటుపడాలని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు ఆచరనీయం, క్రీస్తు మార్గము అనుసరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
Updated Date - Dec 24 , 2023 | 06:32 PM