scorecardresearch

Hyderabad: తెలంగాణలో హీట్ పెంచుతున్న ఉన్నతాధికారుల తీరు

ABN , First Publish Date - 2023-10-04T17:17:00+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఉన్నతాధికారుల తీరు హీట్ పెంచుతోంది. ఆరుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న అధికారులఫై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

Hyderabad: తెలంగాణలో హీట్ పెంచుతున్న ఉన్నతాధికారుల తీరు

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఉన్నతాధికారుల తీరు హీట్ పెంచుతోంది. ఆరుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న అధికారులఫై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారన్న ఆరోపణలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, అధికార దూర్వినియోగనికి పాల్పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఆధారాలతో పాటు కేంద్ర బృందానికి కాంగ్రెస్ నేతలు (Congress Leaders) నివేదిక అందజేశారు. ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రభుత్వ పెద్దలకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మొత్తం 9 మంది అధికారులపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. 6 గురు ఐఏఎస్‌ (IAS)లు, మరో ముగ్గురు రాష్ట్ర సర్వీస్‌లోని ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు... హెచ్ఎండీఏ (HMDA), ఐటి శాఖ (IT Dept.), ఇరిగేషన్ (Irrigation), రెవిన్యూ (Revenue), సీఎంవో (CMO), టీఎస్ఐఐసీ (TSIIC) డిపార్ట్‌మెంట్‌లలో ఉన్నతాధికారులపై ఈ మేరకు నేతలు ఫిర్యాదు చేశారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-10-04T17:17:00+05:30 IST